telugu child names



   పల్లెల్లో సంక్రాంతి  హడావిడి మొదలయిందికోళ్లపందాల జోరుఊపందుకుంటోందిఆస్తి , అంతస్తులు పణంగా పెట్టే వేట మళ్లీమొదలైందిపందెం కోళ్లు రెడీ అయిపోయాయిఇన్నాళ్లుజీడిపప్పుబాదం పప్పు లాంటివి పెట్టి కంటికి రెప్పలా పెంచినయజమానులు.. బరిలోకి దిగి.. మీసం మెలేస్తున్నారుకాయ్ రాజాకాయ్ అంట పందేలకు దిగుతున్నారు ఆటలో పడి... వేటలోమునిగి ఎంతోమంది కుబేరులుబికారులయ్యారు
              ఇవేమీ ఆర్డనరీ కోళ్లు కాదువెరీ వెరీ స్పెషల్బరిలోకిదిగాయంటే ప్రత్యర్థి పంబ రేగ్గొట్టేలా ఢీ అంటే ఢీ అంటాయి.కయ్యానికి కాలు దువ్వుతూ పౌరుషంతో రెచ్చిపోతాయిఈకోడిపందేలది చిన్నచితకా చరిత్రేం కాదుచరిత్రలో  సమరాల్నేసృష్టించాయి... రాజ్యాల్నే కూల్చేశాయిఎంతోమంది తలరాతలుమార్చేశాయి.
సంక్రాంతి సీజన్వచ్చిందంటే పల్లెల్లోహడావుడిమొదలవుతుంది.పల్లెజనం మేల్కొనేదికొక్కొరోకో సౌండ్తోనే.సంకురాత్రి సంబరాల్లో...కోస్తా వాసులకు పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ ... కోళ్ల పందాలే!అంతవరకూ బాగా మేపిన కోళ్లను బరిలోకి దించి... చేతినిండాసంపాదించడానికి వాటి యజమానులు ఉవ్విళ్లూరుతారుపండగవేళ ఆడాళ్లంతా పిండివంటలు.. ముగ్గుముచ్చట్లతో బిజీగా ఉంటే..మగమహారాజులు మాత్రం వాటిని భారీస్థాయిలో లాగించి.. సరదాకోసం...  వీటితో బిజీ అయిపోతారుఆతరువాత మొదలవుతుంది అసలు మజాపదికి వందావందకి వెయ్యివేయికి పదివేలు..పదివేలుకు లక్షంటూ కాయ్రాజాకాయ్ అంటూ విరగబడి పందేలుకడతారుకొట్టుకుమ్ము.. ఇరగదియ్.. దూకు... వేసేయ్

No comments:

Post a Comment